ముంబైలో ఐదుగురు పాలమూరు కూలీలు మృతి

Mahaboobnagar Map
మహబూబ్‌నగర్: పొట్ట చేతపట్టుకుని వెళ్లిన పాలమూరు కూలీలు ఐదుగురు ముంబైలో మరణించారు. ముంబైలోని మీరా రోడ్డులో ఓ భవనం 11వ అంతస్థులో పనిచేస్తుండగా జరిగిన ప్రమాదంలో వారు మరణించారు. కట్టెల నిచ్చెన వేసుకుని ఎనిమిది మంది కూలీలు భవనానికి రంగులు వేస్తుండగా నిచ్చెన కూలింది. దీంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మరణించగా, మరో కూలీ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు.

మరణించిన కూలీలు మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలానికి చెందినవారు. దాదాపు 15 రోజుల క్రితం పని కోసం 25 మంది కూలీలు ముంబై వెళ్లారు. వారిలోని ఐదుగురే గురువారం మరణించారు. మృతుల్లో నారాయణపేట మండలం కేర్నపల్లి గ్రామానికి చెందిన రాజు, మోనాపురం గోవిందు, ఎం నగేష్, చాతనపల్లికి చెందిన మాచప్ప, చెన్నప్ప ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+