సమైక్యమే తప్పదంటే రాయల తెలంగాణ: జెసి దివాకర్ రెడ్డి

JC Diwakar Reddy
అనంతపురం: రాయల తెలంగాణకు తమకు సమ్మతమేనని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి గురువారం అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణ ప్రాంతంలో కలుపుతారన్న వాదనలు తీవ్రంగా వినిపిస్తున్న నేపథ్యంలో జెసి దివాకర్ రెడ్డి స్పందించారు. తాము మొదట సమైక్య వాదులమని చెప్పారు. అయితే పార్టీ విభజన తప్పదని చెబితే తాము రాయల తెలంగాణకు అనుకూలంగా ఉన్నామన్నారు. శ్రీశైలం, తుంగభద్ర నది ఒకే రాష్ట్రంలో ఉంటేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే భౌగోళికంగాను అది సమ్మతమే అన్నారు.

కాగా తనపై జిల్లాకు చెందిన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పాటిల్ వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పాటిల్‌వి మతిలేని వ్యాఖ్యలన్నారు. ఆయనకు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోందన్నారు. జిల్లాలో అసలైన కాంగ్రెసు వాదులం తామే అన్నారు. పాటిల్‌కు ఎమ్మెల్సీ టిక్కెట్ కాంగ్రెసు ఇస్తే ఆయన వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పడమే అందుకు నిదర్శనం అన్నారు. పాటిల్ వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునన్నారు. దీపక్ తెలుగుదేశం పార్టీలో చేరటం ఆయన వ్యక్తిగతమన్నారు.

కాగా అంతకుముందు పాటిల్ వేణుగోపాల్ రెడ్డి జెసిపై తీవ్రమైన విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో జెసి ఒప్పందం కుదుర్చుకొని తనను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడించారన్నారు. జెసి జిల్లాలో శకుని పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+