మంత్రులకు చేదు అనుభవం, రాజీనామాకు డిమాండ్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పొద్దున ఓ మాట సాయంత్రం ఓ మాట చెబుతున్నారని విమర్శించారు. అడ్వోకేట్ల సలహాలు, సూచనలు తమకు అవసరం లేదన్నారు. సమ్మె వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందన్నారు. నల్గొండ జిల్లా చండూరులో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి సైతం చేదు అనుభవం ఎదురయింది. మంత్రి కాన్వాయ్‌ని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణ కోసం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. అయితే తమపై మంత్రి అనుచరులు సైతం దాడి చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు ధర్నాకు దిగారు. ఇద్దరు యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి మంత్రి అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications