తెలంగాణ టిడిపి బస్సుయాత్ర ఉద్రిక్తం, ఎర్రబెల్లి అరెస్టు

దీంతో ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి తదితర పలువురు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి రామాయంపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. తమ నేతల బైఠాయింపుకు నిరసనగా టిడిపి నేతలు రహదారి పైనే బైఠాయించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అరెస్టు కాని మిగిలిన నేతలు బాన్సువాడ వైపు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. కాగా అంతకుముందు హైదరాబాదు నుండి బయలుదేరిన సమయంలో వారు మీడియాతో మాట్లాడారు.
ఐదేళ్ల పాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే ఆ తర్వాత మాత్రం హైదరాబాదు తెలంగాణకే చెందుతుందని ఎర్రబెల్లి అన్నారు. అలాకాకుండా రాష్ట్రపతి పాలన పెడతామనే హెచ్చరికలకు తెలంగాణ ప్రజలు భయపడరని ఉద్యమం ఆగదన్నారు. బాన్సువాడ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే తాను ఉప ఎన్నికల నుండి వైదొలగుతానని ఆయనే స్వయంగా చెప్పారని ఇప్పుడు ఆయన మాట తప్పకూడదన్నారు. ఉప ఎన్నికల పేరుతో సీట్లు పెంచుకునే కుట్ర తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు.












Click it and Unblock the Notifications