ఆజాద్ నివేదిక తర్వాత తెలంగాణపై సమయం: చిదంబరం

తెలుగుదేశం, మజ్లీస్ పార్టీలు కాంగ్రెసు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాయని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణపై స్పందించనే లేదని ఆయన అన్నారు. ఆ పార్టీల నిర్ణయం కూడా కాంగ్రెసు నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని ఆయన అన్నారు. కాంగ్రెసు నిర్ణయం తీసుకున్న తర్వాత అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సమస్య తీవ్రతను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, అందువల్ల సమ్మెను కొనసాగించడం సరి కాదని ఆయన అన్నారు. సమ్మెను, రాస్తారోకోలను, రైల్ రోకోలను విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆందోళనల వల్ల అభివృద్ధి కుంటు పడుతుందని, ఆర్థికాభివృద్ధి కూడా కుంటుపడుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications