హైదరాబాద్ బంద్, నిర్మానుష్యంగా రాజధాని రోడ్లు

కాగా ఇదే ఆఖరు బందు అని అందరూ సహకరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి బందుకు అందరూ సహకరించాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి(జెఏసి) చైర్మన్ ఆచార్య కోదండరాం ప్రకటన సమయంలోనే విజ్ఞప్తి చేశారు. మరో వైపు వనస్థలిపురంలో సచివాలయ ఉద్యోగులను విధులకు పంపించడంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు. మూడు రోజుల క్రితం తెలంగాణవాదులు సచివాలయ ఉద్యోగుల బస్సులను అడ్డుకొని అద్దాలు పగుల గొట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ఒక బృందం అర్ఏఎఫ్‌తో పాటు నాలుగు స్టేషన్ల పోలీసులను మోహరించారు.












Click it and Unblock the Notifications