హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్యాంధ్రకే మొగ్గు చూపుతున్న సీమాంధ్ర నేతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు సమైక్యాంధ్రకే ఓటు వేస్తున్నారు. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి, మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు తదితర నేతలంతా సమైక్యాంధ్రే మా నినాదం అంటున్నారు. జెసి మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వస్తే సీమాంధ్రుల ఆస్తులకు రక్షణ ఉండదనే తాము సమైక్యాంధ్ర కోరుకుంటున్నామని జెసి చెప్పారు. హైదరాబాదులోని సీమాంధ్రుల ఆస్తులకు రక్షణ కల్పించాలని తాను ముఖ్యమంత్రిని కోరానని చెప్పారు. తన ట్రావెల్సుకు చెందిన బస్సును ఎవరో తగుల పెట్టారని అందుకే తాము భయపడుతున్నట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదన్నారు. ఆయన ఒక్కోసారి మాట్లాడుతారన్నారు. ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గతంలో మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే రాజీనామా చేసే వారన్నారు. నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంపై ఆరోపణలు వచ్చినప్పుడు మంత్రులు రాజీనామా చేశారన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన శంకర్ రావు జిందాబాద్ అని నినాదం చేశారు.

కాగా తాము సమైక్యాంధ్రనే కోరుకుంటున్నామని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి వేరుగా అన్నారు. తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. మరోసారి రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన కేంద్రం నుండి రాలేదన్నారు. తెలంగాణపై చర్చకు ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖర రావు ఓ మెట్టు దిగి రావడం మంచి పరిణామం అన్నారు. మరోవైపు రాయపాటి సాంబశివ రావు సైతం సమైక్యమే అని చెబుతున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రలో కాంగ్రెసు గల్లంతవుతుందని హెచ్చరించారు. పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో కొద్ది రోజులు రాష్ట్రపతి పాలన విధించవచ్చన్నారు.

English summary
Anantapur district senior MLA, former minister JC Diwakar Reddy praised Minister Shankar Rao today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X