తెలంగాణపై బాబుకు స్పష్టత లేదు: ఎర్రబెల్లి దయాకర్ రావు

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి స్పష్టత లేదని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మూడు ప్రాంతాల్లోనూ పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు తెలంగాణపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారని ఆయన సోమవారం అన్నారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం, కాంగ్రెసు సహా అన్ని పార్టీలు కూడా స్వార్థంతోనే వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు పార్టీకి రాజీనామా చేస్తే, తాము కూడా పార్టీకి రాజీనామా చేస్తామని ఆయన అన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో దేవరుప్పల్ నుంచి వరంగల్ జిల్లా పాలకుర్తి వరకు సాగే బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు.

పార్టీలను వదిలేసి తెలంగాణ నాయకులంతా తెలంగాణ జెఎసి కింద పనిచేయాలని ఆయన సూచించారు. తెరాసకు తెలంగాణపై చిత్తశుద్ధి లేదని, కేవలం బలాన్ని పెంచుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ ఢిల్లీ వెళ్లలేదని, తనకొచ్చే ప్యాకేజీ గురించి మాట్లాడుకోవడానికే ఢిల్లీ వెళ్లారని ఆయన అన్నారు. కెసిఆర్ తెలంగాణ తెలుగుదేశం నాయకులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో తమ పార్టీని నాశనం చేసేందుకు శాయసక్తులా ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. 2014 కల్లా కెసిఆర్ తాను తీసిన గోతిలో తానే పెడతారని ఆయన వ్యాఖ్యానించారు. తాను తెలంగాణపై చంద్రబాబుకు స్పష్టత లేదని అన్నట్లు వచ్చిన వార్తలు అబద్ధమని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తాను చేసినట్లు వచ్చిన వార్తలపై కలకలం చెలరేగడంతో ఆయన వివరణ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించారు.

కాంగ్రెసు పెద్దలతో కెసిఆర్ ఢిల్లీ ఏం మంతనాలు జరుపుతున్నారో వెల్లడించాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు టి. దేవెందర్ గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆందోళన ఉధృతంగా సాగుతున్న తరుణంలో కెసిఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారని ఆయన అడిగారు. కాంగ్రెసు పెద్దలు చర్చలకు పిలిస్తే కెసీఆర్ ఢిల్లీ వెళ్లారా, తనంతాతానుగానే వెళ్లారా అని ఆయన అడిగారు. అర్థరాత్రి వరకు ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్న కెసిఆర్ వాటి వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండు చేశారు. తెలంగాణ రైతులపై ముఖ్యమంత్రి కక్ష కట్టారని ఆయన సోమవారం విడిగా మీడియా ప్రతినిధులతో మాట్లాడురు. విద్యుత్తు సమస్యను వెంటనే పరిష్కరించపోతే సబ్ స్టేషన్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+