తెలంగాణపై దసరా తర్వాత కిరణ్, బొత్సలతో కసరత్తు

ప్రత్యేక సమైక్య వాదాలు, సమ్మె అంశాలపై వారు చర్చలు జరిపారు. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే విధంగా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చ జరిగింది. మంత్రివర్గ సమావేశం జరపలేని పరిస్థితులపై కూడా సమావేశం దృష్టి పెట్టింది. దసరా తరువాత అందుబాటులో ఉండాలని అధిష్ఠానం తనకు సూచించిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించినట్లు తెలిసింది.
కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ దసరా పండుగ జరుపుకొనేందుకు ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్నారు. పండుగ తర్వాత ఆయన ఢిల్లీ తిరిగి వస్తారు. ఇలా ప్రణబ్ ఢిల్లీ వచ్చాక కిరణ్‌కు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చే అవకాశాలుంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 7,8 తేదీల్లో జిల్లా పర్యటనలు, ఇతర అధికారిక కార్యక్రమాలు వేటినీ ముఖ్యమంత్రి పెట్టుకోలేదు. దీన్ని బట్టి ఈ రోజుల్లో ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications