కాంగ్రెసు విలీనం ప్రకటనపై భగ్గుమన్న హరీష్

Harish Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తమ పార్టీలో విలీనమవుతుందంటూ కాంగ్రెసు నాయకులు చేసిన ప్రకటనలపై తెరాస శానససభ్యుడు హరీష్ రావు భగ్గుమన్నారు. కాంగ్రెసు నేతలు కె. కేశవరావుకు, జానా రెడ్డికి తామేమైనా పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చామా అని ఆయన అడిగారు. కేశవరావు, జానా రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఆయన బుధవారం ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో అన్నారు. తమ పార్టీ గురించి మాట్లాడడానికి వారెవరని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణపై కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. తెలంగాణ ఇవ్వకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని ఆయన అన్నారు. తెరాస తెరాసగానే ఉంటుందని, ఏ పార్టీలోనూ విలీనం కాదని ఆయన అన్నారు. తమ గురించి మాట్లాడాలని తాము ఎవరికీ చెప్పలేదని ఆయన అన్నారు. విలీనం గురించి కాంగ్రెసు నాయకులు అనుకుంటున్న మాటలే తప్ప తమకు సంబంధించిన వ్యవహారం కాదని ఆయన అన్నారు. తెలంగాణ విషయం 2004లో తమతో పొత్తు పెట్టుకున్నప్పుడు గానీ యుపిఎ ఉమ్మడి కార్యాచరణలో చేర్చినప్పుడు గానీ రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చినప్పుడు గానీ ప్రణబ్ ముఖర్జీకి తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+