ప్రణబ్ ప్రకటనను తేలిగ్గా తీసుకున్న కోదండరామ్

తాము చేస్తున్న సమ్మె సెగ ఢిల్లీని తాకిందని ఆయన అన్నారు. సమ్మెపై ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. గతంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి ఉద్యమాలు రాలేదని, ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇతర రాష్ట్రాల డిమాండ్లు వస్తాయని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆ పార్టీ వైఖరిపై తాము నిర్ధారణకు రాలేమని ఆయన అన్నారు. ఈ నెల 9,10,11 తేదీల్లో తలపెట్టిన రైల్ రోకో యధాతథంగా కొనసాగుతుందని ఆయన చెప్పారు. రెండు రోజుల్లో ఉద్యమ ఉధృతికి కార్యాచరణ రూపొందిస్తామని ఆయన అన్నారు.
కాగా, ప్రణబ్ ముఖర్జీ ప్రకటనపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు దేవేందర్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రణబ్ ప్రకటన కుట్రపూరితమని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మరోసారి కాంగ్రెసు పార్టీ తెలంగాణను మోసం చేయడానికి పూనుకుందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాతనే ప్రణబ్ నుంచి ఆ ప్రకటన వెలువడిందని ఆయన అన్నారు. తెరాసను కాంగ్రెసులో విలీనం చేయడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications