తెలంగాణపై ప్రణబ్ వాస్తవాన్నే చెప్పారు: లగడపాటి

కాంగ్రెసు పార్టీ రాష్ట్ర ప్రజలతో చెలగాటమాడుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ విరుచుకు పడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అసాధ్యమని కేంద్రం చెప్పకనే చెప్పినట్టు కేంద్ర మంత్రి ప్రణబ్ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన వైఖరి మార్చుకోవాలన్నారు. అదిగో తెలంగాణ ఇదిగో తెలంగాణ అంటూ కెసిఆర్ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వారంలో తెలంగాణపై కీలక ప్రకటన అని ఇటీవల ప్రకటించిన కెసిఆర్ ఆ ప్రకటన ఇదేనా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలుపుకోవడానికి కెసిఆర్ సిద్ధమవడం రాజకీయ వ్యూహమేనన్నారు. ఈ రెండు జిల్లాల్లో తప్ప ఇతర జిల్లాల్లో ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ ఉంటుందని భావించిన కెసిఆర్ వాటిని కలుపుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications