దసరా వేళ మందుబాబులకు దెబ్బ, నో స్టాక్ బోర్డులు

గురువారం దసరా పండుగ కావడంతో ప్రస్తుతానికి కృత్రిమ కొరత సృష్టించి ఆ తర్వాత మరింత ఎక్కువ ధరలకు అమ్ముకోవాలని చూసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మద్యం స్టాక్ మరింత కావాలని దుకాణ యజమానులు అంబర్ పేటలోని లిక్కర్ డిపో వద్ద మధ్యాహ్నం ఆందోళనకు దిగడం విశేషం. మరోవైపు ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ తిరుపతిలో మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు సమ్మెకు దిగడం నిబందనలకు విరుద్దమన్నారు. సమ్మెకు దిగకుండా ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నామని సాయంత్రం వరకు చర్చలు పూర్తి కావచ్చునన్నారు. పరిస్థితి చేయి దాటినా ప్రత్యామ్నాయాలు చూస్తామని మోపిదేవి చెప్పారు.












Click it and Unblock the Notifications