చుక్కా రామయ్యను బోధనను తప్పు పట్టిన సిఎం

సాంకేతిక విద్య పేదలకు అందినప్పుడే నిజమైన అభివృద్ధి అని ఆయన అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామంలో రూ. 400 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఐఐటి హైదరాబాద్ తొలి దశ భవనాలకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఐఐటి మెదక్ జిల్లాలోనే ఉన్నా దీన్ని ఐఐటి హైదరాబాద్ అని పిలవాలని ఆయన అన్నారు. దిశానిర్దేశం లేని చదువు, కార్యక్రమాలు ఫలితాన్ని ఇవ్వవని ఆయన అన్నారు. అనుకున్నది సాధించేందుకు నిర్దిష్ట ప్రణాళిక, కసరత్తు అవసరమని ఆయన అన్నారు. మన విద్యార్థుల ప్రతిభను చూసి అమెరికా సైతం తమ విద్యార్థులను హెచ్చరిస్తోందని ఆయన అన్నారు. ఇంజనీరింగ్, వైద్య విద్యలు మాత్రమే విద్యలు కావని కూడా ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications