తెలంగాణ పరిణామాలపై పురంధేశ్వరి అసంతృప్తి?

తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను తాను వినిపించానని పురంధేశ్వరి అన్నారు. ఎప్పటిలోగా నిర్ణయం జరుగుతుందని అడిగితే తాను చెప్పలేనని, ఆ విషయం ప్రణబ్ ముఖర్జీ చెప్పాలని ఆమె అన్నారు. కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నానని ఆమె అన్నారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కోరానని పళ్లంరాజు చెప్పారు. సకల జనుల సమ్మె, ఆందోళనల వల్ల రాష్ట్రం నష్టోతోందని, అందువల్ల బాధ్యత గల పార్టీగా, ప్రభుత్వంగా సమస్యను పరిష్కరించాల్సి ఉందని ఆయన అన్నారు. సమస్యను దృష్టిలో ఉంచుకుని వివరాలు అందించానని ఆయన చెప్పారు. ఆందోళనల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ఆయన అన్నారు. సామరస్యవూర్వకమైన పరిష్కారం చూపాలని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. ఎప్పుడు నిర్ణయం వెల్లడిస్తారనేది తనకు తెలియదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications