తెలంగాణపై ఉత్కంఠ: ఢిల్లీ బాట పట్టిన రాష్ట్ర నేతలు

శుక్రవారం రాత్రి కాంగ్రెసు మినీ కోర్ కమిటీ ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఎనిమిది అంశాలతో గవర్నర్ రాష్ట్ర పరిస్థితులపై నివేదిక రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి చిదంబరంతో, ప్రధాని మన్మోహన్ సింగ్‌తో గవర్నర్ సమావేశమైన తర్వాత రాష్ట్ర నాయకులతో అధిష్టానం పెద్దలు సమావేశమయ్యే అవకాశం ఉంది. సాయంత్రం మరోసారి కాంగ్రెసు ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. సకల జనుల సమ్మె విరమించాలని కోరుతూ ప్రధాని గానీ కేంద్ర హోం మంత్రి గానీ ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకటన తెలంగాణపై సానుకూల వైఖరిని వ్యక్తం చేస్తూ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications