వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ టీచర్స్ జెఎసి సమ్మె కొనసాగింపునకే నిర్ణయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్: ప్రభుత్వంతో తెలంగాణ టీచర్స్ జెఎసి నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల మధ్యలోనే తెలంగాణ టీచర్స్ జెఎసి నేతలు బయటకు వచ్చేశారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారి తెలంగాణ టీచర్స్ జెఎసి నేతలను సోమవారం చర్చలకు ఆహ్వానించారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తాము సమ్మెను కొనసాగిస్తామని టీచర్స్ జెఎసి నేతలు మీడియా ప్రతినిధులతో చెప్పారు. చర్చలు చేస్తున్నామంటూ ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇస్తోందని వారన్నారు. హైదరాబాదులోని విద్యాసంస్థలను మూసేయాలని తెలంగాణ రాజకీయ జెఎసి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

సమ్మె విరమించాలని తెలంగాణలోని ప్రభుత్వ విద్యాసంస్థల టీచర్లకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంతకు ముందు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ టీచర్స్ జెఎసి నాయకులను చర్చలకు ఆహ్వానించారు. అయితే, పేరుకు మాత్రమే తమను చర్చలకు ఆహ్వానించారని తెలంగాణ టీచర్స్ జెఎసి నేతలు అభిప్రాయపడుతున్నారు. విద్యాసంస్థలను మూసేయవద్దని హైదరాబాదులోని కూకట్‌పల్లిలో ఆందోళనకు దిగినవారు తెలంగాణ అంతటా పర్యటించి ఆ విజ్ఞప్తి చేయాలని వారు డీమాండ్ చేశారు. తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్న సమయంలో చర్చల పేరుతో ప్రభుత్వం మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని వారంటున్నారు.

కాగా, న్యాయశాఖ తెలంగాణ ఉద్యోగులు రేపటి నుంచి (మంగళవారం నుంచి) ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు ఆబ్కారీ శాఖ తెలంగాణ ఉద్యోగులు తమ సమ్మెను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. కమిషనర్ సమీర్ శర్మతో ఎక్సైజ్ శాఖ తెలంగాణ ఉద్యోగ ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 11వ తేదీ హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి మహా ధర్నాకు పోలీసు శాఖ అనుమతి ఇచ్చింది.

English summary
Talks between Telangana teachers JAC and government failed today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X