హద్దు మీరితే చర్యలు: డిజిపి దినేష్ రెడ్డి హెచ్చరిక

DGP Dinesh Reddy
మహబూబ్ నగర్: ఉద్యమం పేరుతో విధులను అడ్డుకున్నా, హింసాత్మక చర్యలకు పాల్పడినా నేరుగా జైలుకే పంపిస్తామని డిజిపి దినేష్ రెడ్డి మంగళవారం తెలంగాణవాదులను మహబూబ్ నగర్‌లో హెచ్చరించారు. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్‌ను ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తే పోలీసులు జోక్యం చేసుకోరని కానీ విధులకు ఆటంకం కలిగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు.

సోమవారం, మంగళవారం జరిగిన అరెస్టులు నాన్ బెయిలబుల్ కేసులే అన్నారు. ఉద్యమకారులు శాంతియుతంగా ఉద్యమిస్తే సహకరిస్తామన్నారు. రైలురోకోను అడ్డుకోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తామన్నారు. రైల్వే ఆస్తులను నష్టపర్చడం తీవ్రమైన నేరమన్నారు. రైల్వే ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దన్నారు. రైల్వే స్టేషన్లకు మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా ఉద్యమించవచ్చన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+