సిఎం ఎన్ని వెర్రి వేషాలు వేసినా ఆగదు: కెసిఆర్

వంద శాతం తెలంగాణ వచ్చి తీరుతుందన్నారు. ఉద్యోగుల జీతాలు ఎక్కడకు పోవని తెలంగాణ వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసి ప్రమోషన్లు ఇస్తామన్నారు. తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుందన్నారు. ఢిల్లీ పెద్దలు తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా ఏం చేస్తున్నారన్నారు. కాలాయాపన సరికాదన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేసి ఢిల్లీ చేతులో పెడతారా అని ప్రశ్నించారు. ఆంధ్రా నేతలంతా కలిసి సమ్మె విరమించినట్లు ప్రకటించారని తెలంగాణలో బస్సులు ఎక్కడా తిరగడం లేదన్నారు. 1956 నాటి ముందు తెలంగాణే కావాలన్నారు.












Click it and Unblock the Notifications