తిరగబడతారు: కెసిఆర్‌పై సీమాంధ్ర నేతల ఫైర్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి కెటిఆర్‌కు లేదని ఎమ్మెల్యే జోగి రమేష్ విజయవాడలో అన్నారు. సమ్మె కారణంగా ప్రజలు ప్రయివేటు వాహనాల్లో ప్రయాణించి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రుల కుయుక్తులకు అధిష్టానం లొంగవద్దని కోరారు. కెసిఆర్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు త్వరలో తిరగబడతారన్నారు. కెసిఆర్ తన మనవళ్లను కార్పోరేట్ పాఠశాలల్లో చదివిస్తూ సామాన్య ప్రజల బిడ్డల చదువుకు అడ్డుకుంటున్నారని మరో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు.












Click it and Unblock the Notifications