ఎమ్మెల్సీ రేసులో గిరీష్ సంఘీ, రోశయ్య ఆశీస్సులు

కాగా, కంతేటి సత్యనారాయణ రాజు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, గంగాధరం కూడా ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. గంగాధరంకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచన మాత్రం మరో రకంగా ఉంది. ఆంధ్ర నేతకు ఆ సీటు కేటాయించదలుచుకుంటే భమిడిపాటి రామమూర్తికి, తెలంగాణ నేతకు కేటాయించే దలిస్తే తన క్లాస్ మేట్ రసూల్ ఖాన్‌కు ఆ సీటు ఇప్పించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ సీటు రోశయ్య రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయింది. అందువల్ల రోశయ్య మాటకే అధిష్టానం విలువ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గిరీష్ సంఘీ తన సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో రోశయ్య ఆ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications