టి-ఉద్యోగులపై వేటుకు సిద్ధం: సమ్మెపై ప్రభుత్వం కొరడా

Swamy Goud
హైదరాబాద్: తెలంగాణలోని సకల జనుల సమ్మెపై కొరడా ఝులిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంగళవారం డిజిపి దినేష్ రెడ్డి, శాంతి భద్రతల ఐజి అనూరాధ హెచ్చరికలు చూస్తుంటే సమ్మెను ప్రభుత్వం అణిచి వేయాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే వారికి ధీటుగా తెలంగాణవాదులు స్పందిస్తున్నారు. దమ్ముంటే సమ్మెను ఆపండని, అరెస్టులు చేయండని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. సమ్మె తీవ్రత తగ్గించడంలో భాగంగా తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిని ఉపేక్షించవద్దని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే... ఉద్యోగ సంఘాల నేతలకు చివరి అవకాశం ఇవ్వాలని, బుధవారం జరిగే చర్చల్లో అనుసరించబోయే వైఖరి ఆధారంగా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

ఈ చర్చలకు ఉద్యోగ సంఘాల నేతలు హాజరుకాకపోయినా... హాజరైనప్పటికీ సమ్మెపై తమ వైఖరి మార్చుకోకున్నా కొరడా ఝళిపించాలని తీర్మానించుకున్నట్లు తెలిసింది. బుధవారంనాటి చర్చలే ఆఖరని, మరోమారు సంప్రదింపులు ఉండబోవని కూడా సర్కారు సంకేతాలు పంపుతోంది. కేంద్రం తెలంగాణపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అలాగని... ఉద్యోగుల సమ్మెను అలాగే వదిలేస్తే ఇది ఎంతకాలం కొనసాగుతుందో, ఎక్కడికి దారి తీస్తుందోనని సర్కారులో ఆందోళన మొదలైంది. అందుకే... దీనిపై కఠిన వైఖరి ప్రదర్శించాలని సర్కారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. బుధవారం నాటి చర్చల్లో తొలుత విన్నపం చేయాలని... అది ఫలించకపోతే జీవో 177 కింద ప్రాథమిక స్థాయిలో చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. అప్పటికీ ఉద్యోగులు దారికి రాకపోతే అదే జీవో కింద 'డిస్మిస్' వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
ముందుగా రాష్ట్ర స్థాయి నేతలపైన ఆ తర్వాత జిల్లా స్థాయి నేతలపై చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.

ఇప్పటిదాకా ఆందోళనల్లో పాల్గొన్న ఉద్యోగులను అరెస్టు చేస్తే... సొంత పూచీకత్తుపై బెయిలు ఇచ్చి విడుదల చేసేవారు. ఇకపై.. అలా కాకుండా రిమాండ్‌కు పంపించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకుపైగా రిమాండ్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా సస్పెండ్ అవుతారు. అవసరమైతే, గతంలో తమిళనాడు ప్రభుత్వం ఆర్టికల్ 311 కింద సమ్మెలో ఉన్న ఉద్యోగులందరినీ సస్పెండ్ చేసినట్లుగా 'సామూహిక వేటు' వేసే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకోవడంతోపాటు, విధులకు వచ్చే వారికి ఆటంకం కల్పిస్తే ఈ ఆర్టికల్ కింద చర్యలు తీసుకోవచ్చు. సుప్రీం కోర్టు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది. ఇక... జీవో 177ను అమలు చేయాల్సిందేనని హైకోర్టే సర్కారును ఆదేశించింది. చర్యలకు గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+