కిరణ్! దూకుడు తగ్గించు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఉద్యమం శాంతియుతంగా జరుగుతోందన్నారు. ఇందుకు అందరూ సహకరించాలన్నారు. తెలంగాణ ఇస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు, సైన్యం ఏర్పాటు చేసుకుంటామని మంత్రి టిజి వెంకటేష్ వంటి వారు హెచ్చరిస్తున్నారని అలాంటి వారి పైన కేసులు పెట్టకుండా టిఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర రావు, విఠల్, స్వామి గౌడ్‌లపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసన్నారు. కాని శాంతియుత ఉద్యమాన్ని రెచ్చగొట్టవద్దని సిఎంను కోరారు.
ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలను చర్చలంటూ పిలుస్తూనే మరోవైపు వారిపై కేసులు పెడుతున్నారని ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని ఎంపీ మంద జగన్నాథం న్యూఢిల్లీలో అన్నారు. ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని సిఎం కుట్ర చేస్తున్నారన్నారు. బుధవారం సాయంత్రం స్పీకరు మీరా కుమార్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించమని కోరతామని చెప్పారు.












Click it and Unblock the Notifications