తెలంగాణపై మమత మాటలు భేషన్న శంకర రావు

P Shankar Rao
హైదరాబాద్: తెలంగాణకు, గూర్ఖాలాండుకు సంబంధం లేదన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఆహ్వానించ దగ్గవని చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర రావు బుధవారం అన్నారు. ఆమె చెప్పినట్లుగా గూర్ఖాల్యాండుకు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలంగాణ కోసం ప్రజాప్రతినిధులు అందరూ వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్నారన్నారు. ఉద్యమకారులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం ప్రభుత్వానికి తగదన్నారు. తెలంగాణ సమస్యను కేంద్రం వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కారానికి కాలపరిమితి ఉండాలన్నారు. తెలంగాణపై కేంద్రం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. సకల జనుల సమ్మె ముప్పయ్యవ రోజుకు చేరినప్పటికీ నిర్లిప్తత తగదన్నారు.

మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్య కోసం కాంగ్రెసు ప్రయత్నిస్తుందని విమర్శలు చేయడం తగదన్నారు. తెలంగాణవాదులు ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని రైలు రోకోను వాయిదా వేయడం కాకుండా విరమించుకోవాలని కోరారు. తన తుది శ్వాస విడిచే వరకు తాను అవినీతిపై పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+