వైయస్ జగన్ టార్గెట్లపై తెలంగాణ నేతల అసంతృప్తి

నవంబర్ 1వ తేదీ లోగా మండల, గ్రామస్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా నాయకులకు ఆయన 20 శాతం ప్రజలను పార్టీ సభ్యులుగా చేర్చాలనే టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణపై తన వైఖరిని కర్ర విరగకుండా పాము చావకుండా చెప్పినట్లు తెలుస్తోంది. తాము తెలంగాణకు అనుకూలమూ కాదు, వ్యతిరేకమూ కాదని ఆయన చెప్పారని తెలుస్తోంది. మిగతా పార్టీల మాదిరిగానే వ్యవహరించాలని ఆయన పార్టీ నాయకులకు సూచించినట్లు సమాచారం. ఇంతకాలం ఓదార్పు యాత్రలతో బిజీగా గడిపిన వైయస్ జగన్ ఇప్పుడు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి సారించారు.












Click it and Unblock the Notifications