వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బులు తీసుకునే సంస్కృతి మీదే: కెటిఆర్‌పై దానం, గండ్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

danam nagendar
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి పదమూడు మంది శాసనసభ్యులను రూ.25 లక్షలకు కొన్నారన్న తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావుపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు పలువురు గురువారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. డబ్బులు వసూలు చేసే సంస్కృతి కాంగ్రెసు పార్టీలో లేదని తెరాసలోనే ఉందనే విషయం కెటిఆర్ తెలుసుకోవాలని మంత్రి దానం నాగేందర్ విమర్శించారు. కాంగ్రెసు పార్టీ నేతలు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటారన్నారు. కెటిఆర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చినట్టు ఆధారాలు ఉంటే కెటిఆర్ బయట పెట్టాలని శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి సవాల్ చేశారు. తెరాసకు అమ్ముడు పోయే అలవాటు ఉన్నదని అందరికీ తెలుసన్నారు. నిరాధార వ్యాఖ్యలు చేసిన కెటిఆర్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును పరిశీలిస్తామన్నారు. కేంద్రం నుండి రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అధికారికంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యాసంస్థలను సకల జనుల సమ్మె నుండి విరమించాలనే విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ ఉద్యమం పేరుతో చందాలు తీసుకునే అలవాటు తెరాసకు ఉంది కాబట్టే కెటిఆర్ అలాంటి వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ రంగారెడ్డి అన్నారు. కెటిఆర్ నిజాయితీపరుడైతే వారి ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించుకోవాలని సవాల్ విసిరారు. కెసిఆర్ కుటుంబం కంటే అతిపెద్ద అవినీతిపరులు ఎవరూ లేరన్నారు. ఉద్యమం పేరుతో అందరి నుండి చందాలు వసూళ్లు చేస్తారని ఆరోపించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్నప్పుడు తెరాస ఎంత డబ్బు తీసుకుందని ప్రశ్నించారు. కెటిఆర్ కుటుంబానికి ఎప్పుడూ డబ్బు సంపాదించాలనే ధ్యాసేనని విమర్శించారు. వసూల్ రాజా వసూల్ రాణిలు మా పార్టీలో లేరని రుద్రరాజు పద్మరాజు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో చిత్రాలు విడుదల చేయడానికి చిత్ర పరిశ్రమ కూడా భయపడుతోందన్నారు.

English summary
Minister Danam Nagendar condemned MLA K Taraka Rama Rao comments on CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X