దొరల పాలనపై కెసిఆర్‌కు లగడపాటి లేఖాస్త్రం

ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు తెలంగాణ ప్రజలపై సాగిన అణచివేత, దురహంకార పాలన రాతి గుండెలను కూడా కరిగిస్తాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతం 200 సంవత్సరాల పాటు దొరలు, పటేళ్ళు, పట్వారీల పదఘట్టనల కింద నలిగిపోయిందన్నారు. నియంతృత్వ విధానాలు, వెట్టి చాకిరీ విధానాన్ని అడ్డుకునేందుకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని మించిన పోరాటం మరొకటి చరిత్రలో లేదని వివరించారు. సుదీర్ఘకాలం పాటు నియంతృత్వ పాలనలో మగ్గిపోయిన తెలంగాణ ప్రాంతం విశాలాంధ్ర ఏర్పడిన తరువాత మాత్రమే స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు, హక్కులను అనుభవించగలిగిందని తెలిపారు.
తెలంగాణకు సంబంధించిన అంశాలపై ఆ ప్రాంత రచయితలు, కవులు రాసిన 12 పుస్తకాలు, ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాల సీడీలను ఆయన కెసిఆర్‌కు పంపారు. ఆ పుస్తకాలు చదివి వాస్తవాలు తెలుసుకుంటే కెసిఆర్ మారుతారని, తరువాత ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పగలుగుతారని లగడపాటి అన్నారు. కేసీఆర్ పేరిట ఉన్న ఈ లేఖను టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి రాజగోపాల్ పంపారు.












Click it and Unblock the Notifications