కేంద్రాన్ని కూలుస్తామని లగడపాటి బెదిరింపు: యాష్కీ

కేంద్రం 2009 డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడక పోతే తాము కూడా ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధమని హెచ్చరించారు. అధిష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటారని చెప్పారు. జైపాల్ రెడ్డి చెప్పినందు వల్లే తాము రైలు రోకో కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంపై పోరాడం సాధారణ విషయమేనని తాము మాత్రం ప్రభుత్వంలో ఉండి పోరాటం చేస్తున్నామన్నారు. తమకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఉద్యమిస్తున్నామన్నారు. పార్టీ తెలంగాణపై వెనక్కి పోతే భారతీయ జనతా పార్టీతో కలిసి అధిష్టానంపై ఫైట్ చేస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటే తమకు ముఖ్యమన్నారు. గతంలో ప్రకటించిన ఆమరణ దీక్షకు కట్టుబడి ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications