శ్రీకాళహస్తి: విశ్వసుందరి పోటీల్లో నెగ్గుకు రాలేకపోయిన తెలుగమ్మాయి వాసుకి సుంకవల్లి రాజకీయాల్లో నెగ్గుకు రావాలని ఉవ్విళ్లూరుతోంది. రాజకీయాల్లోకి రావడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె అన్నది శ్రీ కాళహస్తీశ్వరాలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేసిన ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడింది. రాజకీయాల్లో రాణించడమే తన ప్రధాన లక్ష్యమని వాసుకి చెప్పింది.బ్రెజిల్ కస్టమ్స్ అధికారుల వల్ల విశ్వసుందరి పోటీల నుంచి తాను నిష్క్రమించానని వాసుకీ తెలిపింది. బ్రెజిల్‌లో జరిగిన విశ్వసుందరి పోటీలకు భారత్ తరపున పాల్గొనేందుకు వెళ్లినప్పటికీ, తన సంప్రదాయ దుస్తులతో కూడిన ప్యాకేజీ వల్ల బ్రెజిల్ కస్టమ్స్ అధికారుల చేతిలో చిక్కుకుపోయానని తెలిపింది.
దానివల్ల మిస్ యూనివర్స్ పోటీల్లో సరిగ్గా పాల్గొనలేకపోయానని వాసుకీ ఆవేదన వ్యక్తం చేసింది. అంతకుముందు శ్రీ కాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న వాసుకీకి ఆలయ అర్చకులు ప్రసాద, తీర్థాలను అందజేశారు. విశ్వసుందరి పోటీల్లో వాసుకి టాప్ టెన్‌లో కూడా స్థానం సంపాదించుకోలేకపోయింది.