గన్‌మెన్‌ను సరెండర్ చేసిన తెరాస ఎమ్మెల్యేలు

శాసనసభ్యులు కెటి రామారావు, హరీష్ రావు, ఈటెల రాజేందర్ తదితర తెరాస శానససభ్యులు తమ తమ గన్‌మెన్‌ను సరెండర్ చేస్తూ ఎస్పీలకు లేఖలు రాశారు. తమ శాసనసభ్యులను ప్రజలు ఎన్నుకున్నారని, ప్రజల్లో తిరగడానికి వారికి భద్రత అక్కర్లేదని తెరాస నాయకుడు కర్నె ప్రభాకర్ మీడియా ప్రతినిధులతో అన్నారు. పోలీసు ఆఫీసర్ల సంఘం వ్యాఖ్యలకే కాకుండా డిజిపి దినేష్ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా కూడా గన్‌మెన్‌ను సరెండర్ చేయాలని తమ పార్టీ శాసనసభ్యులు నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications