రాష్టాన్ని ముక్కలు చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే: ఎర్రంనాయుడు

రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న కాంగ్రెసుకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రం మౌనం వీడాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్‌కు పదవిలో ఉన్నప్పుడు తెలంగాణ గుర్తుకు రాలేదని, పదవి లేకపోవడం వల్లనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారని ఆయన అన్నారు. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం 2009 డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటనపై తమకు విశ్వాసం ఉందని, అదువల్లనే తాము పోరాటం జోలికి వెళ్లలేదని ఆయన అన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాన్ని అదే విధంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నవంబర్ 1వ తేదీ లోగా ప్రకటన చేయకపోతే తమ సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్టాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications