ప్రకటన చేయాలని గులాం నబీ ఆజాద్‌ను కోరిన బొత్స

బొత్స సూచనల మేరకు ఆజాద్ సాయంత్రం సమ్మె విరమించాలని ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన గులాం నబీ ఆజాద్ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరమించాలని కోరిన విషయం తెలిసిందే. దసరా పండుగ ముందు ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో రాస్తా రోకో కూడా ఉన్నందున దాన్ని విరమించాలనీ కోరారు. కాగా ఢిల్లీ వెళ్లిన పిసిసి చీఫ్ బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అగ్ర నేతలతో తెలంగాణ, సకల జనుల సమ్మె, రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఎమ్మెల్సీ సీటుపై చర్చిస్తున్నట్టుగా సమాచారం.












Click it and Unblock the Notifications