టర్కీలో భూకంపం, వేయి మంది సజీవ సమాధి

భూకంపం వల్ల 500 నుంచి వేయి మంది దాకా మరణించి ఉంటారని కందిల్లి సీస్మాలాజికల్ సంస్థ ప్రొఫెసర్ ముస్తాఫా ఎర్డిక్ చెప్పారు. నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. యాభై మందిని వాన్ సిటీలోని ఆస్పత్రుల్లో చేర్చినట్లు వార్తలు వచ్చాయి. తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. పలు బహుళ అంతస్థుల భవనాలు,, హోటళ్లు, ఇతర కట్టడాలు కూలిపోయాయి. కూలిపోయిన భవనాలను, వాహనాలను, ప్రజలు ఇళ్లు వదిలి పారిపోతున్న దృశ్యాలను టీవీలు ప్రసారం చేశాయి. టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నది.












Click it and Unblock the Notifications