వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎస్ ఎమ్మెల్సీ తీసుకోవడం సిగ్గుచేటు: నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

nagam janardhan reddy
హైదరాబాద్: శాసన మండలి స్థానాన్ని మాజీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తీసుకోవడం సిగ్గు చేటని తెలంగాణ నగారా సమితి చైర్మన్, నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం విమర్శించారు. తెలంగాణ కోసం 72 గంటల దీక్ష చేపట్టిన విద్యుత్ ఉద్యోగ సంఘం నేత రఘు మంగళవారం తన దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, నాగం, టిఆర్ఎస్ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్, టీఎన్జీవో నేతలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాగం మాట్లాడారు. బుధవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి తాము రాజీనామాలు ఆమోదించమని కోరతామన్నారు. తెలంగాణ కోసమంటూ కొందరు ప్రజాప్రతినిధులు ఉత్తుత్తి రాజీనామాలు చేశారని విమర్శించారు.

తెలంగాణ కోసం రాజకీయ నేతలు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనాలని టిఎన్జీవోల సంఘం నేత స్వామి గౌడ్ అన్నారు. ఉద్యమంలో ఉద్యోగులు ఉడత పిల్లలేనని, ఐఏఎస్, ఐపిఎస్‌లు పాల్గొనడం విశేషమన్నారు. తెలంగాణలాంటి ఉద్యమం ప్రపంచంలో ఎక్కడా కనిపించదన్నారు. సకల జనుల సమ్మెకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాము ఏ రాజకీయ పార్టీలకు తొత్తులం కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమంలో ముందున్నందునే ఆ పార్టీ వెంట నడిచామన్నారు. రాజకీయ నేతలకు అండగా నిలవాలనే సమ్మెలో పాల్గొన్నామన్నారు.

English summary
Telangana Nagara Samithi chairman Nagam Janardhan Reddy blamed D Srinivas for taking MLC seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X