వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిక్కుల్లో స్వామిగౌడ్, భూవ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Swami Goud
హైదరాబాద్: తెలంగాణ సకల జనుల సమ్మెలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాల జెఎసి నేత స్వామి గౌడ్ చిక్కుల్లో పడ్డారు. ఉద్యోగులకు దక్కాల్సిన ప్లాట్లను ఆయన సొంతం చేసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై తెలంగాణ అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సంయుక్త పోరాట సమితి బుధవారం గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ఉద్యోగ సంఘాలకు రావాల్సిన స్థలాలను స్వామిగౌడ్ ఆక్రమించారని సమితి నాయకులు ఆరోపించారు.

తెలంగాణ ఎన్జీవో సంఘాలకు గృహ నిర్మాణాల కోసం కేటాయించిన 160 ఎకరాల స్థలం ఆక్రమణ జరుగుతోందని వారు గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో తెలిపారు. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని వారు గవర్నర్‌ను కోరారు. స్వామిగౌడ్‌ను అక్రమాల నుంచి కాపాడడానికే సకల జనుల సమ్మెను విమరించారని ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ ఇటీవల ఆరోపించారు కూడా.

English summary
Complaint was made against Telangana non gazetted employees unions JAC leader Swami Goud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X