ఇక్కడి నుండే విదేశాలకు: సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ

ఎగుమతులకు సంబంధించిన సంపూర్ణ రికార్డులు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇనుప ఖనిజం ఎగుమతులపై త్వరలో చార్జీషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. పోర్టు, కస్టమ్స్ కార్యాలయంలో రికార్డుల తనిఖీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం గనుల అక్రమాల కేసును సిబిఐ వేగంగా చేసుకు పోతోంది. ఇన్నాళ్లూ కేసుకు సంబంధించిన వారిని హైదరాబాద్ రప్పించి విచారించిన విషయం తెలిసిందే. ఇటీవలె సిబిఐ బృందం బళ్లారిలోనూ కార్యాలయం తెరుస్తారనే వార్తలు వచ్చాయి. గాలి కేసును మరింత వేగవంతం చేసేందుకే అక్కడి వారిని అక్కడే విచారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి కోర్టుకు సమర్పించాలని సిబిఐ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications