పొలంలో దొరికిన 115 బంగారు నాణేలు లభ్యం

Mahaboob Nagar District
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ గ్రామంలోని పొలంలో 115 బంగారు నాణేలు లభించాయి. మహబూబ్‌నగర్ జిల్లా మనపాడు మండలం కలుగుంట్ల గ్రామంలోని పొలంలో ఆ నాణేలు లభించాయి. పొలంలో కలుపు తీస్తుండగా చిన్న కుండల్లో దాచిపెట్టిన బంగారు నాణేలు కూలీలకు, గ్రామస్థులకు కనిపించాయి. వాటిని తీసి వారు పంచుకున్నారు. మంగళవారంనాడు ఈ సంఘటన జరిగింది. పోలీసులు వాటిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు.

బంగారు నాణేలు బయటపడిన విషయాన్ని కొందరు గ్రామ ప్రజలు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి 115 బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో నాణెం బరువు 1 నుంచి 3 గ్రాముల వరకు ఉంటుందని పోలీసు అధికారి చెప్పారు. ఆ నాణేలు ప్రాచీనమైనవని, మరిన్ని బంగారు నాణేలు ఉండవచ్చుననే ఉద్దేశంతో అన్వేషణ సాగుతోందని, బంగారు నాణేల గురించి పురాతత్వ శాఖ అధికారులను గ్రామ ప్రజలను విచారిస్తున్నారని, అవి ఏ కాలానికి చెందినవో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వివరించారు. మనపాడు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+