ఉద్యమాన్ని దెబ్బతీసేందుకే ఆరోపణలు: కోదండరామ్

ప్రభుత్వం, సీమాంధ్ర నేతలు కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పాలకులు ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. సీమాంధ్ర పాలకులు చేస్తున్న కుట్రలను ప్రజలు నమ్మరన్నారు. స్వామి గౌడ్ పైన చేస్తున్న అవినీతి ఆరోపణలకు పరువు నష్టం దావా వేస్తామని ఉద్యోగ సంఘాల జెఏసి హెచ్చరించింది. స్వామి గౌడ్‌పై వచ్చిన ఆరోపణలు కొత్తవి కావన్నారు. హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరగలేదని లోకాయుక్త ఎప్పుడో తేల్చిందన్నారు. అక్రమాలు జరిగితే చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆరోపణలు చేసిన స్ట్రగుల్ కమిటీ వెనుక ఎవరున్నారో చెబుతామన్నారు. రూ.50వేల డిపాజిట్ కట్టని వారే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications