చంద్రబాబుపై మరోసారి ధ్వజమెత్తిన నాగం

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలకు చంద్రబాబు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు తటస్థ వైఖరిని ఆయన తప్పు పట్టారు. తటస్థమంటే ఏమిటని ఆయన అడిగారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని తాను గవర్నర్ నరసింహన్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. పోలవరంపై తెలుగుదేశం తెలంగాణ నాయకుల వైఖరిని ఆయన తప్పు పట్టారు.

పోలవరం ప్రాజెక్టును నిర్మించాలంటూ టెండర్‌ను రద్దు చేయాలనే తెలుగుదేశం తెలంగాణ నేతల వైఖరి సరైంది కాదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే వద్దని అంటుంటే ఇదేమిటని ఆయన అడిగారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ వారు తెలంగాణకు అన్యాయం చేయడానికి సిద్ధపడ్డారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అక్రమాలకు పాల్పడి అర్హత లేనివారికి పోలవరం కాట్రాక్టు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు విషజ్వరాలతో, కరువుకాటకాలతో, విద్యుత్తు కోతతో బాధపడుతుంటే ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. ఏం చేశారని తెలంగాణ మంత్రులు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని ఆయన అడిగారు.

పోలవరం ప్రాజెక్టును ఆపితే తెలంగాణ సాధించుకున్నట్లేనని తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ గద్దర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆదివాసి విద్యార్థులు చేపట్టిన పోలవరం బస్సు యాత్రను ఆయన గురువారం జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణకు వ్యతిరేకమని తెలిసి కూడా ఏ పార్టీ కూడా పోలవరం ప్రాజెక్టును ఆపించే ప్రయత్నం చేయడం లేదని ఆయన విమర్శించారు. మరో ఆరు నెలల్లో విద్యార్థులను, ప్రజా సంఘాల కార్యకర్తలను, అడ్వకేట్లను, డాక్టర్లను తదితరులను కలిపి ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తామని, అప్పుడు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇస్తుందో చూస్తామని ఆయన అన్నారు. బస్సు యాత్రకు విరాళాలు సేకరించేందుకు తాను భిక్షాటన చేస్తానని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి వరకు తాను భిక్షాటన చేస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+