జపాన్ గర్ల్‌పై రేప్: ఏడాదిన్నర తర్వాత నిందితుడి అరెస్టు

జపాన్‌కు చెందిన 24 ఏల్ల నోమురా భారత సందర్శనకు వచ్చింది. ఆమె నిరుడు ఏప్రిల్ 16వ తేదీన గయా నుంచి బుద్ధ గయాకు ప్రయాణిస్తుండగా ఐదుగురు వ్యక్తులు దాడి చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సంఘటన జరిగిన పది రోజుల్లోనే పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ఆ ముగ్గురిని కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది. శుక్రవారం యాదవ్ పట్టుబడడంతో కేసు దర్యాప్తు కాస్తా ముందుకు కదిలింది. ఐదో నిందితుడు అరెస్టయిన తర్వాతనే కేసు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications