ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది: మందా జగన్నాథం

Manda Jagannatham
హైదరాబాద్: తమ పార్టీకి చెందిన మరో ఐదు, పది మంది తెలంగాణ శాసనసభ్యులు రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం అన్నారు. ముగ్గురు శాసనసభ్యుల రాజీనామా వల్ల మిగతా శాసనసభ్యులపై ఒత్తిడి పెరుగుతుందని, రాజీనామాల కోసం మిగతా శాసనసభ్యులపై ప్రజలు ఒత్తిడి తెస్తారని ఆయన ఆదివారం ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ముగ్గురు శాసనసభ్యుల రాజీనామాలు తెలంగాణ ప్రక్రియ వేగవంతం కావడానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిణామాన్ని పరిగణనలోకి తీసుకుని తమ పార్టీ అధిష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకునే చర్యలను వేగవంతం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ కోసం రాజీనామా చేస్తానని జూపల్లి కృష్ణారావు ఆత్మబలిదానం చేసుకున్న తెలంగాణ యువకుల శవాల మీద ప్రమాణం చేశారని, అలా ప్రమాణం చేసిన తర్వాత పదవిలో కొనసాగడం, పార్టీలో కొనసాగడం చాలా కష్టంగా ఉందనీ ఒత్తిడికి గురవుతున్నానని జూపల్లి చెప్పారని, అందుకే జూపల్లి రాజీనామా చేసి ఉంటారని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాలో తెలంగాణ కోసం ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని, ఆ ఒత్తిడి కారణంగా రాజయ్య రాజీనామా చేసి ఉంటారని ఆయన అన్నారు. పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తమ పార్టీ అధిష్టానం తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+