ఎమ్మెల్యేలపై, చిరు పార్టీపై సిబిఐ విచారణ: ఆనం

ఇటీవల క్యాష్ ఫర్ ట్రాన్స్‌ఫర్ చాలా అనాగరికంగా తయారయిందన్నారు. ఒక పార్టీ నుండి గెలిచిన వారు మరో పార్టీలో చేరుతున్న ఆరోపణలు ఇటీవల చాలా వినిపిస్తున్నాయన్నారు. ఇలాంటి శాసనసభ్యుల అమ్మకాలు ఆపాలంటే సిబిఐ విచారణ జరిపించాలన్నారు. ధనవంతులు, అత్యాశపరులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందన్నారు. టిఆర్ఎస్‌లోకి వెళ్లిన కాంగ్రెసు ఎమ్మెల్యేలు ప్యాకేజీ మాట్లాడుకున్నారన్నారు. వారు పార్టీ మారటం బాధాకరమని, వారిది తొందరపాటు చర్య అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు మైనార్టీలో పడలేదన్నారు.
భూముల కేటాయింపుల విధానంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. హౌస్ కమిటీపై సర్కారు గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు.












Click it and Unblock the Notifications