తెరాస అధినేత కెసిఆర్‌పై విరుచుకుపడిన కెకె

K Keshava Rao
న్యూఢిల్లీ: తమ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుడు కె. కేశవరావు ధ్వజమెత్తారు. పార్టీని వీడిన శానససభ్యుల ఆవేదనను అర్థం చేసుకున్నామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసును చీల్చడం మంచిది కాదని ఆయన కెసిఆర్‌కు సూచించారు. తెలంగాణ సాధనే ఇరు పార్టీల ధ్యేయమని ఆయన అన్నారు. ముగ్గురు శానససభ్యులు పోయినంత మాత్రాన ఏమీ కాదని కొంత మంది అంటున్నారని, తాను అలా అనడం లేదని, ముగ్గురు తనకు తగ్గారని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.

తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా తమతో కలుపుకుని పోతామని ఆయన చెప్పారు. తెలంగాణ సాధించి తీరుతామని ఆయన చెప్పారు. తెలంగాణ సాధించే వరకు పోరాటం ఆగదని ఆయన అన్నారు. తమ సహనానికి కూడా పరిమితి ఉందని, తెలంగాణ ఇవ్వకపోతే దేనికైనా సిద్ధపడుతామని ఆయన అన్నారు. తెలంగాణపై తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు చేస్తున్నామని, మనమే ఇచ్చి తీరాలని చెబుతున్నామని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీయే తెలంగాణ తెస్తుందని, ఒత్తిడి ద్వారానే తెలంగాణ సాధించగలుగుతామని ఆయన అన్నారు. తాము ఢిల్లీకి కొన్నిసార్లు బహిరంగంగా, కొన్ని సార్లు రహస్యంగా వస్తున్నామని, మీడియా ఏవేవో రాస్తోందని ఆయన అన్నారు. తాము బిచ్చమడుగుతామా, బితిమిలాడుతామా, తెలంగాణ తెచ్చుకుంటామని ఆయన అన్నారు. కాంగ్రెసును చీలిస్తే తెలంగాణ ఉద్యమానికి దెబ్బ తగులుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం దేనికైనా సిద్ధమని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తారనే పూర్తి నమ్మకం సోనియాపై ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై రాజీ పడే ప్రసక్తి లేదని సోనియాకు, కేంద్ర హోం మంత్రి చిదంబరానికి చెప్పామని ఆయన అన్నారు. తెలంగాణను ఇచ్చే సామర్ధ్యం కాంగ్రెసుకే ఉందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. పార్టీలను చీల్చడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన వెనక పడుతుందని ఆయన అన్నారు. పార్టీలను చీల్చడం మంచిది కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+