బాబుపై వైయస్ విజయమ్మ పిల్ విచారణ వాయిదా

చంద్రబాబు సిఎం హోదాలో అక్రమంగా నిధులు మళ్లించారని విజయమ్మ తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ వాదించారు. దుబాయ్, సింగపూర్, హాంగాంగ్, మలేషియా దేశాలకు హవాలా ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్నారు. కెజి బేసిన్‌ను ముఖేష్ అంబానీకి అప్పనంగా అప్పగించారన్నారు. ఐఎంజి భూముల కేటాయింపులో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. ఐఎంజికి ప్రభుత్వ భూమిని కట్టబెట్టారని, ఐఎంజికి క్యాబినెట్ అనుమతులు లేవన్నారు.
కాగా చంద్రబాబు తన హయాంలో భారీ అక్రమాలకు పాల్పడ్డారని వైయస్ విజయమ్మ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. అందులో బాబు అధికారంలో ఉన్నప్పుడు ఎలా అక్రమాలకు పాల్పడ్డారో వివరించారు. ఆయన ఆస్తులు ఎప్పుడెప్పుడు ఎంత పెరిగాయో వివరించారు. ప్రతివాదుల్లో సుజనా చౌదరి, ఈనాడు అధినేత రామోజీ రావు తదితర ఇరవై పేర్లను చేర్చారు.












Click it and Unblock the Notifications