విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవగాహన లేదు: లగడపాటి, వేడుకల్లో వైయస్ విజయమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ/కడప: అవగాహన లేకనే వారు రాష్ట్ర అవతరణ వేడుకలను బహిష్కరిస్తున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మంగళవారం అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని లగడపాటి రాజగోపాల్ ప్రకాశం బ్యారేజ్ వద్దనున్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంపై అవగాహనలేని వారే వేడుకలను బహిష్కరిస్తారని అన్నారు. భావోద్వేగం వల్ల వచ్చిన సమస్యలు త్వరలో పరిష్కరింప బడతాయన్నారు. తెలంగాణ సెంటిమెంట్ భావోద్వేగం వల్ల వచ్చిందేనన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస రావు, సమైక్యాంధ్ర పోరాట సమితి నేతలు పాల్గొన్నారు.

పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పులివెందులలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పట్టణ శాసనసభ్యుడు శ్రీధర కృష్ణారెడ్డి శ్రీరాములుకు పూలమాల వేసి నివాళులర్పించారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతోనే ప్రారంభమయిందన్నారు. కాగా ఆయా జిల్లాల కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండా ఎగుర వేశారు.

English summary
Vijayawada MP Lagadapati Rajagopal said today that telanganites are did not ready to understand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X