హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ నోటీసు తీసుకోవడం లేదు: ఐటి శాఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: సీబీఐ గుర్తించిన అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నోటీసు తీసుకోవటంలేదని నాంపల్లి సీబీఐ కోర్టుకు బెంగళూరు ఐటీ అధికారులు వివరించారు. జగన్ ఆస్తులు, పెట్టుబడుల వివరాల కోసం బెంగళూరు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీబీఐకి లేఖ రాశారు. ఆ వివరాలు తాము నేరుగా ఇవ్వలేమని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ చెప్పడంతో ఐటి శాఖ నాంపల్లి సీబీఐ కోర్టును ఆశ్రయించింది.

ఐటి శాఖ తమను ఆశ్రయించడంతో జగన్‌కు నోటీసివ్వాల్సిందిగా ఐటీ అధికారులను కోర్టు ఆదేశిస్తూ అక్టోబర్ 31కి కేసు వాయిదా వేసింది. సోమవారం విచారణ ప్రారంభమవగానే ఐటీ లాయర్లు వాదిస్తూ జగన్‌మోహన్ రెడ్డి ఇంట్లో లేరని ఆయన తరపు వారెవ్వరూ నోటీసు తీసుకోవటం లేదని వెల్లడించారు. దీంతో ప్రత్యేక మెసెంజర్ ద్వారా జగన్‌కు నోటీసివ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. పిటిషన్‌ను జగన్‌కు అందజేయాలని కూడా కోర్టు ఐటి శాఖను ఆదేశించింది.

English summary
Bangalore IT Department said to the court that YS Jana is not accepting notice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X