వైయస్‌పై సభా సంఘమా, సిగ్గుమాలిన చర్య: జగన్

YS Jagan
గుంటూరు: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూపంపిణీలపై సభా సంఘం వేయాలనే ఆలోచనను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేదలకు పంచిన భూములపై సభా సంఘం వేస్తామని అనడం సిగ్గుమాలిన చర్య అని ఆయన అన్నారు. గుంటూరు జిల్లాలో వైయస్ జగన్ మంగళవారం తన ఓదార్పు యాత్రను కొనసాగించారు. వరహాపురం ఓదార్పు యాత్ర సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల హయాంలో జరిగిన భూకేటాయింపులను పక్కన పెట్టి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై సంఘం వేస్తామని అనడం కక్ష సాధింపు చర్య అని ఆయన అన్నారు.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమ్మక్కయి సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వంతో చేతులు కలిపి హేయంగా ప్రవర్తిస్తున్నారని ఆనయ అన్నారు. ప్రజలు ప్రతి విషయాన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారు. గుంటూరు జిల్లాలో ఆయన ఓదార్పు యాత్ర 16వ రోజుకు చేరుకుంది. అంతకు ముందు ఆయన జంపని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+