హైటెక్ సిటీ చుట్టూ రౌండ్లు: బాబుపై సిఎం కిరణ్ సెటైర్

Kiran Kumar Reddy
రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సెటర్లు వేశారు. సిఎం కిరణ్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో రచ్చబండ-2 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోలేదని అయితే ఇప్పటికైనా ఆయనకు వ్యవసాయం గుర్తుకు రావడం సంతోషకరమని అన్నారు. ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత బాబుకు అప్పడప్పుడు రైతుకు గుర్తుకు వస్తున్నాడని చురకలు వేశారు. చంద్రబాబు ఐటి డెవలప్‌మెంట్ కోసం హైదరాబాదులో ఒక్క హైటెక్ సిటీ కట్టించాడని నిత్యం ఆయన దానిని చూపించి అభివృద్ధి చేశానని చెబుతుంటాడన్నారు.

ఆయన ఎప్పుడూ హైటెక్ టవర్ చుట్టూ తిరుగుతుంటాడని సెటైర్ వేశారు. ఇంత అభివృద్ధి చేసిన రాజధానిలో టిడిపి ఒక్క ఎమ్మెల్యే సీటు ఎందుకు గెలవలేక పోయిందని ప్రశ్నించారు. దీనిని అందరూ గుర్తించాలన్నారు. అయినా ఆయన గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం గానీ, మాట్లాడాల్సిన అవసరం గానీ లేదన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు జాతీయస్థాయిలో చక్రం తిప్పానని చెప్పుకుంటుంటాడని అదే నిజమైతే ఆయన హయాంలో పంటకు మద్దతు ధర ఎందుకు లభించలేదన్నారు. రైతుల కోసం ఆయన కేంద్రాన్ని అడగకుంటే అది ఆయన తప్పని, కేంద్రం వినకపోతే ఆయన చెప్పుకునే పరపతిని ప్రశ్నించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.

రాజకీయ లబ్ధి కోసమే పాదయాత్ర చేపట్టారన్నారు. ఆధార్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చునని చెప్పారు. త్వరలో ఇరవయ్యారు లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రచ్చబండ-2 ద్వారా యాభై లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. త్వరలో ఆరు లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామన్నారు. రైతుల కోసం కృషి చేసే పార్టీ కాంగ్రెసు పార్టీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+