కాంగ్రెసును వీడేది లేదు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం

అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమని ఆయన బుధవారం ఉదయం అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానన్నారు. సకల జనుల సమ్మెకు కొనసాగింపుగా ఉద్యమ వేడి చల్లారొద్దనే ఉద్దేశ్యంతోనే తాను దీక్షకు పూనుకున్నట్లు చెప్పారు. ఒకరిద్దరు నేతలు రానంత మాత్రాన తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకుందన్నారు. నేతలంతా స్వచ్ఛందంగానే తన వద్దకు వస్తున్నారన్నారు. త్వరలో తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఉద్యమంలోకి వస్తారని ఆకాంక్షించారు. దీక్షతోనైనా కేంద్రం, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించి త్వరలో తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గాంధేయ మార్గంలో చేస్తున్న తన దీక్షను భగ్నం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు.












Click it and Unblock the Notifications