ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో కోనేరు ప్రసాద్ అరెస్టు

ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి)కి తెలియకుండా ఎమ్మార్ ప్రాపర్టీస్, స్టైలిష్ హోమ్స్ ఒప్పందం చేసుకుని విల్లాలను అధిక ధరలకు విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. గజానికి 25 నుంచి 50 వేల రూపాయల ధరలకు కోనేరు ప్రసాద్ విల్లాలను విక్రయించి రికార్డుల్లో ఐదు వేల రూపాయల ధరనే రికార్డు చేసినట్లు తెలుస్తోంది. విల్లాల విక్రయంపై కోనేరు ప్రసాద్ నివాసంలో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. స్టైలిష్ హోమ్స్ తప్పుడు లెక్కల వల్ల ఎపిఐఐసికి భారీగా నష్టం వాటిల్లింది.
కోనేరు ప్రసాద్ అరెస్టుతో ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసు కీలకమైన మలుపు తిరిగింది. ఎమ్మార్ ప్రాపర్టీస్, వైయస్ జగన్ ఆస్తుల కేసుల్లో ఇదే తొలి అరెస్టు. ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాలపై సిబిఐ ఆగస్టు 17వ తేదీన కేసు నమోదు చేసింది.












Click it and Unblock the Notifications